Karimnagar: శాతవాహన విశ్వవిద్యాలయంలో "పరీక్షల శిక్షణ కేంద్రం" ప్రారంభం!
Karimnagar: కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో సెంటర్ ఫర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రారంభమైంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ అందిస్తామని వీసీ తెలిపారు.
Karimnagar: శాతవాహన విశ్వవిద్యాలయంలో "పరీక్షల శిక్షణ కేంద్రం" ప్రారంభం!
కరీంనగర్: శాతవాహన విశ్వవిద్యాలయంలో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని "పరీక్షల శిక్షణ కేంద్రం" (సెంటర్ ఫర్ కంపిటిటివ్ ఎగ్జామ్స్) ను ఈరోజు డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ లైబ్రరీ ఆడిటోరియంలో కో-ఆర్డినేటర్ గా డాక్టర్ ఎన్. వి. శ్రీరంగా ప్రసాద్ తో కలిసి ఉపకులపతి ఆచార్య ఉమేశ్ కుమార్ ముఖ్య అతిధిగా విచ్చేసి ఘనంగా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ
వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ మార్గదర్శకత్వం అందించడమే ఈ కేంద్రం ముఖ్య ఉద్దేశమని, అన్ని రకాల సౌకర్యాలతో ఈ సెంటర్ ని ఏర్పాటు చేస్తున్నామని విద్యార్థులు ఈ అవకాశాలు సద్వినియోగం చేసుకొని బంగారు భవిషత్తుకు పునాదులు వేసుకోవాలన్నారు.
విశిష్ట అతిథిగా రిజిస్ట్రార్ ఆచార్య సతీష్ కుమార్ పెద్దపెల్లి పాల్గొని విద్యార్థులకు ప్రత్యేకమైన అవకాశాలు కల్పించి ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో ముందుకు వెళ్లాలంటే మంచి అకాడమిక్ వాతావరణం కావాలని దీనికోసం మంచి నిపుణులను తీసుకువచ్చి తరగతులు నిర్వహిస్తామని వారి శిక్షణలో విద్యార్థులు క్రమశిక్షణతో అంకితభావంతో వీటిని అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు.
గౌరవ అతిథులుగా డాక్టర్ డి. హరికాంత్ విసి ఓఎస్‌డీ, ప్రొఫెసర్ కె. పద్మావతి ప్రిన్సిపాల్, ఆర్ట్స్, సోషల్ సైన్సెస్ అండ్ లా కళాశాల, డాక్టర్ ఎస్. రమాకాంత్ ప్రిన్సిపాల్, సైన్స్ కళాశాల, ఈ సెంటర్ కో కో-ఆర్డినేటర్లు గా డాక్టర్ డి. విజయప్రకాష్ ఇంగ్లీష్ విభాగం, డాక్టర్ డి. విజయ్ కుమార్ కెమిస్ట్రీ విభాగం పాల్గొని ఈ శిక్షణ కేంద్రం ద్వారా విద్యార్థులకు పోటీ పరీక్షలలో విజయం సాధించేందుకు అవసరమైన పూర్తి సహాయ సహకారాలు, సరైన దిశానిర్దేశం లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.కలిసి ఘనంగా ప్రారంభించారు.




