Karimnagar: క్రీడలు వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడతాయి: రిజిస్ట్రార్!
Karimnagar: కరీంనగర్ శాతవాహన వర్సిటీలో అంతర్‌కళాశాలల ఆర్చరీ, కబడ్డీ ఎంపిక పోటీలు జరిగాయి. క్రీడలు సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడతాయని రిజిస్ట్రార్ పి.సతీష్ కుమార్ అన్నారు.
Karimnagar: క్రీడలు వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడతాయి: రిజిస్ట్రార్!
కరీంనగర్: కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయ క్రీడా మైదానంలో అంతర్ కళాశాలల ఆర్చరీ, కబడ్డీ జట్టు ఎంపికల పోటీలను నిర్వహించారు. శాతవాహన విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య పి. సతీష్ కుమార్ క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థుల మానసిక ఉల్లాసానికి, క్రమశిక్షణకు సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి క్రీడలు ఎంతగానో తోడ్పడతాయని తెలిపారు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని చాటుతూ విశ్వవిద్యాలయానికి జాతీయ స్థాయిలో మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమం స్పోర్ట్స్ సెక్రటరీ డాక్టర్ నజిముద్దీన్ మున్వర్, స్పోర్ట్స్ అండ్ యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ డాక్టర్ కృష్ణ కుమార్, పి.డి విజయ్ కుమార్ పర్యవేక్షణలో జరిగింది. ఈ ఎంపిక పోటీలలో వివిధ కళాశాలల పి.డిలు శ్రీధర్, దినేష్, అరుణ్, అజయ్, శ్రీనాథ్, పర్వీన్ మరియు ఇతరులు పాల్గొని ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను విశ్వవిద్యాలయ జట్లకు ఎంపిక చేశారు.




