Karimnagar: శాతవాహన వర్సిటీలో ప్రభావవంతమైన పరిశోధనా ప్రతిపాదనలపై సదస్సు!

Karimnagar: శాతవాహన వర్సిటీలో పరిశోధనా ప్రతిపాదనల రచనపై ఐక్యూఏసీ ప్రత్యేక సదస్సు. నాణ్యమైన పరిశోధనలకు కీలక సూచనలు చేసిన రిజిస్ట్రార్ ఆచార్య సతీష్ కుమార్ పెద్దపెల్లి.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 19 Sept 2026 5:25 PM IST
Karimnagar
X

Karimnagar: శాతవాహన వర్సిటీలో ప్రభావవంతమైన పరిశోధనా ప్రతిపాదనలపై సదస్సు!

కరీంనగర్: శాతవాహన విశ్వవిద్యాలయంలోని అంతర్గత నాణ్యత హామీ విభాగం (ఐక్యూఏసి) ఆధ్వర్యంలో "100 రోజుల ప్రత్యేక కార్యాచరణ" భాగంలో "పరిశోధనా ఫలితాల సమర్పణ, ప్రభావవంతమైన పరిశోధనా ప్రతిపాదనల రచన" అనే అంశంపై ప్రత్యేక నిపుణుల ప్రసంగ కార్యక్రమం విశ్వవిద్యాలయ డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ లైబ్రరీ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించబడింది.

మొట్టమొదటిసారిగా విశ్వవిద్యాలయాన్ని పరిశోధనలలో ముందుకు తీసుకువెళ్లడం కోసం, విశ్వవిద్యాలయం తరఫున వివిధ కళాశాల అధ్యాపకులు తమ యొక్క ప్రాజెక్టులను వివిధ సంస్థలకు సంబంధించి ప్రణాళికలు చేపట్టడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టిన విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య సతీష్ కుమార్ పెద్దపెల్లి ముఖ్య వక్తగా,కీలక ఉపన్యాసకులుగా హాజరై ప్రసంగించారు. ఈ సదస్సుకు డాక్టర్ వి. శ్రీరంగ ప్రసాద్ సమన్వయకర్తగా వ్యవహరించారు.

పరిశోధనపై విస్తృతమైన అనుభవం కలిగి ప్రఖ్యాత దేశాలైన జపాన్ చైనా స్లోవేనియా, ఆస్ట్రేలియా మొదలైన దేశాలలోని విశ్వవిద్యాలయాలతో కలిసి పరిశోధన చేసిన ఆచార్య సతీష్ కుమార్ దిశానిర్దేశం చేస్తూ నాణ్యమైన పరిశోధనా ప్రతిపాదనను రూపొందించడానికి అనుసరించాల్సిన వివిధ కీలక దశలను లోతుగా వివరించారు.

విషయ ఎంపిక సమాజానికి, సైన్స్‌కు ఉపయోగపడే సవాలుతో కూడిన నూతన విషయాలను ఎంచుకోవాలని సూచించారు. ప్రాజెక్టు డిజైన్ ప్రాజెక్టును స్పష్టమైన ప్రణాళికతో ఎలా రూపకల్పన చేయాలో వివరించారు.

సాహిత్య సమీక్ష ఇప్పటి వరకు జరిగిన పరిశోధనలపై సమగ్ర అవగాహన కలిగి ఉండటం వల్ల పరిశోధనలోని లోటుపాట్లను సులభంగా గుర్తించవచ్చని తెలిపారు. లక్ష్యాలు పరిశోధనా లక్ష్యాలు అత్యంత స్పష్టంగా, కొలవదగినవిగా ఉండాలని స్పష్టం చేశారు.

కార్యచరణ విధానం సరైన పరిశోధనా పద్ధతులు, డాటా సేకరణ, విశ్లేషణ విధానాలను అనుసరించడం వల్ల పరిశోధన ప్రామాణికత పెరుగుతుందని, పరిశోధన ద్వారా వచ్చే ఫలితాలు సమాజానికి లేదా విద్యా రంగానికి ఉపయోగపడేలా ఉండాలని కార్యక్రమాన్ని రెండు భాగాలుగా చేసి చాలా వివరంగా తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధికారులు, వివిధ విభాగాల అధిపతులు అధ్యాపకులు డాక్టర్ డి. హరికాంత్ విసి- ఒఎస్డి, ఆచార్య జాఫర్ (డీన్, సీడీసీ), డాక్టర్ ఎస్. రమాకాంత్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్, ఆచార్య కె. పద్మావతి ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్, డాక్టర్ సురేష్ కుమార్ పరీక్షల నియంత్రణాధికారి,ఆచార్య జయంతి, ఆచార్య నమ్రత, డాక్టర్ మనోహర్,విశ్వవిద్యాలయ అధ్యాపకులతో పాటు విశ్వవిద్యాలయ అనుబంధ డిగ్రీ కళాశాలల అధ్యాపకులు, వివిధ కళాశాలల విషయ నిపుణులు, పరిశోధక విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN