Bheemdevarapalli: పిడుగుపాటుకు దెబ్బతిన్న బాధిత కుటుంబాన్ని పరామర్శించిన సర్పంచ్!
Bheemdevarapalli: భీమదేవరపల్లి మండల కేంద్రంలో పిడుగుపాటుకు దెబ్బతిన్న లింగం మొగిలి కుటుంబాన్ని సర్పంచ్ మాచర్ల కుమారస్వామి పరామర్శించి, అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
Bheemdevarapalli: పిడుగుపాటుకు దెబ్బతిన్న బాధిత కుటుంబాన్ని పరామర్శించిన సర్పంచ్!
Bheemdevarapalli: భీమదేవరపల్లి మండల కేంద్రంలో లింగం మొగిలి గారి నివాసంపై అర్ధరాత్రి సమయంలో పిడుగుపడటంతో ఇంటికి తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ ఘటనతో బాధిత కుటుంబం ఆందోళనకు గురైంది.
ఈ విషయాన్ని తెలుసుకున్న భీమదేవరపల్లి సర్పంచ్ మాచర్ల కుమారస్వామి గారు వెంటనే స్పందించి, జరిగిన ప్రమాదం మరియు ఇంటికి జరిగిన నష్టం వివరాలను సంబంధిత తహసీల్దార్ (MRO) గారి దృష్టికి తీసుకెళ్లారు.
దీనిపై స్పందించిన రెవెన్యూ అధికారులు బాధితుల ఇంటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి, జరిగిన నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వ నిబంధనల ప్రకారం తగిన నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఉప సర్పంచ్ శనిగరం ఐలయ్య, తదితరులు ఉన్నారు.




