Kalva Srirampur: కాల్వ శ్రీరాంపూర్‌లో మధ్యాహ్న భోజనం తనిఖీ చేసిన సర్పంచ్
Kalva Srirampur: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ ప్రాథమిక పాఠశాలలో సర్పంచ్ బంగారి రమేష్ మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసి, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
Kalva Srirampur: కాల్వ శ్రీరాంపూర్‌లో మధ్యాహ్న భోజనం తనిఖీ చేసిన సర్పంచ్
పెద్దపల్లి జిల్లా: కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలను స సర్పంచ్ బంగారి రమేష్ మధ్యాహ్నం భోజనం కార్యక్రమాన్ని ఆకస్మికంగా సందర్శించారు.ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన నాణ్యతను వారు స్వయంగా పరిశీలించారు.
అనంతరం విద్యార్థులతో కలిసి కింద కూర్చుని భోజనం చేశారు. భోజనం రుచి, వంటకాల నాణ్యతపై పిల్లలతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నిత్యం పోషకాహారంతో కూడిన, పరిశుభ్రమైన భోజనాన్ని అందించాలని నిర్వాహకులకు సూచించారు.ఈ కార్యక్రమంలో నాయకులు కానిగంటి రాజేందర్, దండి అజయ్, మోటం రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.




