Sircilla: డ్రైవర్ లేకపోవడంతో చెత్త ట్రాక్టర్ నడిపిన అగ్రహారం సర్పంచ్!
Sircilla: రాజన్న సిరిసిల్ల అగ్రహారంలో డ్రైవర్ అందుబాటులో లేకపోవడంతో స్వయంగా చెత్త ట్రాక్టర్ నడిపిన సర్పంచ్ మామిండ్ల కిషన్; పారిశుధ్యంపై నిబద్ధత చాటుకున్న వైనం.
Sircilla: డ్రైవర్ లేకపోవడంతో చెత్త ట్రాక్టర్ నడిపిన అగ్రహారం సర్పంచ్!
Sircilla: గ్రామంలో పారిశుధ్య కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఎల్లారెడ్డిపేట మండలం అగ్రహారం గ్రామ సర్పంచ్ మామిండ్ల కిషన్ ప్రత్యేక చొరవ చూపారు. చెత్త సేకరణ వాహనం నడిపే సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో సర్పంచ్ స్వయంగా చెత్త ట్రాక్టర్ నడిపి గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో చెత్తను సేకరించారు. గ్రామంలో చెత్త పేరుకుపోకుండా, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారిశుధ్య కార్యక్రమాలు కొనసాగించాలనే ఉద్దేశంతో సర్పంచ్ ఈ చర్య చేపట్టారు. ప్రజాప్రతినిధిగా గ్రామ సమస్యలను ప్రత్యక్షంగా పరిష్కరించేందుకు ముందుకు రావడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనను అభినందించారు.ప్రజల అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ గ్రామాభివృద్ధి, పారిశుధ్య నిర్వహణలో సర్పంచ్ చూపిన చొరవ అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.




