Dharmapuri: లక్ష్మీ నరసింహ క్షేత్రంలో ఘనంగా సంకష్టహర చతుర్థి వేడుకలు!
Dharmapuri: జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ గణనాథుని సన్నిధిలో నేత్రపర్వంగా సంకష్టహర చతుర్థి పూజలు. భారీగా తరలివచ్చిన భక్తులు.
Dharmapuri: లక్ష్మీ నరసింహ క్షేత్రంలో ఘనంగా సంకష్టహర చతుర్థి వేడుకలు!
Dharmapuri: నవ నరసింహ క్షేత్రాలలో ఒకటైన జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోని గణనాథుని సన్నిధిలో సంకష్టహర చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ గణనాథుని ఆలయం లో స్వామి వారికి గణపతి ఉపనిషత్తులతో అబిషేకం హారతి మంత్రపుష్పం తదితర కార్యక్రమాలను అర్చకులు,వేదపండితులు కన్నులపండువగా నిర్వహించారు. భారీగా భక్తులు తరలివచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు.
ఈకార్యక్రమంలో దేవస్థానం సూపరింటెండెంట్ అల్వాల శ్రీనివాస్ , సీనియర్ అసిస్టెంట్ వావిలాల తిరుపతి , వేద పండితులు పాలెపు ప్రవీణ్ కుమార్ శర్మ , ఓంకార శర్మ , స్థానిక వేదపండితులు మదు రామ శర్మ , అభిషేకం పురోహితులు బొజ్జా సంతోష్ కుమార్, రాజగోపాల్ అర్చకులు ద్యావల్ల విశ్వనాథ శర్మ , సాయికుమార్ అదిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.




