Karimnagar: రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్‌గా సంగెం లక్ష్మణరావు ఎన్నిక!

Karimnagar: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కరీంనగర్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికైంది. జిల్లా చైర్మన్‌గా సంగెం లక్ష్మణరావు, వైస్ చైర్మన్‌గా రాధాకృష్ణారెడ్డి ఎంపికయ్యారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 5 Oct 2026 7:17 PM IST
Karimnagar
X

Karimnagar: రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్‌గా సంగెం లక్ష్మణరావు ఎన్నిక!

కరీంనగర్: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కరీంనగర్ జిల్లా మేనేజింగ్ కమిటీకి నూతన కార్యవర్గం ఎన్నికల ద్వారా పూర్తి శాస్త్రీయ పద్ధతిలో ఎంపికైంది. డిప్యూటీ కోఆపరేటివ్ ఆఫీసర్ గారి సమక్షంలో నిర్వహించిన ఎన్నికల ప్రక్రియలో నూతన కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గంలో చైర్మన్‌గా సంగెం లక్ష్మణరావు, వైస్ చైర్మన్‌గా రాధాకృష్ణారెడ్డి, స్టేట్ ఈసీ మెంబర్‌గా కుందారపు మహేశ్వర్, కోశాధికారిగా గోనె శ్రీనివాస్, చీఫ్ అడ్వైజరీ కమిటీ చైర్మన్‌గా పెండ్యాల కేశవరెడ్డి ఎన్నికయ్యారు. అదేవిధంగా డైరెక్టర్లుగా రాగి శ్రీనివాస్, రాజిరెడ్డి, కాన్పర్తి మనోహర్ రావు, యూత్ కోఆర్డినేటర్‌గా మొగలోజు రాకేష్ ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా కరీంనగర్ జిల్లాలో మానవతా సేవలను మరింత విస్తృతం చేయడంతో పాటు, రక్తదానం, విపత్తుల సమయంలో సహాయక చర్యలు, ఆరోగ్య సేవలు, యువతను సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడం వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.సమాజంలోని ప్రతి వర్గానికి రెడ్ క్రాస్ సేవలు మరింత చేరువయ్యేలా సమన్వయంతో పనిచేస్తామని,

సంస్థ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు నూతన కార్యవర్గం కృషి చేస్తుందని పేర్కొన్నారు.నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా కార్యదర్శి ఎడ్ల అరవింద్ రెడ్డి రాష్ట్ర నాయకులు సర్దార్ హర్మీందర్ సింగ్ పట్టణ సంఘం అధ్యక్షులు మారుపాక రాజేష్ భరద్వాజ్ నాయకులు సత్యనారాయణ అస్గర్ అలీ అజయ్ కుమార్ రాజశేఖర్ రెడ్డి జాడ కమలాకర్ రగోతం రెడ్డి పలువురు రెడ్ క్రాస్ సభ్యులు, ఉద్యోగ సంఘాల నాయకులు, లయన్స్ క్లబ్ ప్రతినిధులు లయన్ బద్రేశ్ లయన్ శ్రీనివాస్ అభినందనలు తెలిపారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN