Kalwa Srirampur: విజయవంతంగా ముగిసిన సద్దుల బతుకమ్మ, దసరా వేడుకలు!

Kalwa Srirampur: కాల్వశ్రీరాంపూర్‌లో సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాలు విజయవంతం. గ్రామ ప్రజలు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన సర్పంచ్ బంగారి రమేష్.

Srimanthula Kondal, Peddapalli
Published on: 21 Oct 2026 1:29 PM IST
Kalwa Srirampur
X

Kalwa Srirampur: విజయవంతంగా ముగిసిన సద్దుల బతుకమ్మ, దసరా వేడుకలు!

Kalwa Srirampur: సద్దుల బతుకమ్మ మరియు దసరా ఉత్సవాలు విజయవంతంగా ముగిసిన సందర్భంగా సహకరించిన వారందరికీ సర్పంచ్ బంగారి రమేష్ కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ ప్రజలకు, కుల పెద్దలకు, పోలీస్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఉత్సవాల నిర్వహణలో సహకరించిన కెమెరా టీమ్, డప్పు కళాకారులు, మీడియా మిత్రులకు, విద్యుత్ శాఖ వారికి, మరియూ వివిధ శాఖల అధికారులకు, రాజకీయ నాయకులకు, పాలక వర్గానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

గ్రామ ప్రజల సహకారం, భక్తి శ్రద్ధలతో ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయని సర్పంచ్ తెలిపారు. మున్ముందు కూడా సామాజిక సామరస్యం, సంప్రదాయాలను పాటిస్తూ భక్తి శ్రద్ధలతో దసరా ఉత్సవాలను జరుపుకోవాలని గ్రామస్థులకు పిలుపునిచ్చారు.

Srimanthula Kondal, Peddapalli

Srimanthula Kondal, Peddapalli