Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో డిసెంబర్లో 15 రోజుల పాటు సదరం శిబిరాలు!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో డిసెంబర్ నెలలో 15 రోజుల పాటు దివ్యాంగుల ధ్రువీకరణ కోసం సదరం శిబిరాలు నిర్వహించనున్నారు.
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో డిసెంబర్లో 15 రోజుల పాటు సదరం శిబిరాలు!
రాజన్న సిరిసిల్ల జిల్లా: జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో డిసెంబర్ 2026 నెలలో దివ్యాంగుల ధ్రువీకరణ కోసం సదరం శిబిరాలు నిర్వహించనున్నారు. వివిధ రకాల వైకల్యాలకు సంబంధించి సంబంధిత వైద్యులు సూచించిన తేదీల్లో ఈ శిబిరాలను ఏర్పాటు చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ వెల్లడించారు.
కంటిచూపు, వినికిడి, ఆర్థోపెడిక్, మానసిక, జనరల్ వైకల్యాలకు సంబంధించి మొత్తం 15 తేదీల్లో శిబిరాలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 2న వినికిడి పరీక్షలతో శిబిరాలు ప్రారంభం కానుండగా, డిసెంబర్ 3న జనరల్, ఆర్థో విభాగాలకు పరీక్షలు నిర్వహిస్తారు. డిసెంబర్ 4, 5, 7, 8, 9 తేదీల్లో ఆర్థో విభాగానికి, డిసెంబర్ 7, 14, 21, 28 తేదీల్లో కంటిచూపు విభాగానికి శిబిరాలు ఏర్పాటు చేశారు. డిసెంబర్ 10న వినికిడి, 11, 16 తేదీల్లో మానసిక వైకల్య పరీక్షలు నిర్వహించనున్నారు.
ఈ శిబిరాలకు హాజరయ్యే దివ్యాంగులు సంబంధిత మెడికల్ డాక్యుమెంట్లు, ఎక్స్రేలు, యూడీఐడీ అప్లికేషన్ ఫారం, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజు ఫొటో, ఫోన్ నంబర్ తప్పనిసరిగా వెంట తీసుకురావాలని సూచించారు. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటలకు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిర్వహించే సదరం శిబిరాలకు హాజరుకావాలని తెలిపారు.
ఈ సమాచారాన్ని క్షేత్రస్థాయి మండల అభివృద్ధి అధికారులు, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కమిషనర్ల ద్వారా ప్రజలకు తెలియజేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులకు ఆసుపత్రి సూపరింటెండెంట్ కోరారు.




