Ramagundam: కన్జ్యూమర్ రైట్స్ అధ్యక్షుడిగా ఎస్. సుమన్ బాబు నియామకం!
Ramagundam: రామగుండం నియోజకవర్గ కన్జ్యూమర్ రైట్స్ కమిటీ అధ్యక్షుడిగా ఎస్. సుమన్ బాబు నియమితులయ్యారు.
Ramagundam: కన్జ్యూమర్ రైట్స్ అధ్యక్షుడిగా ఎస్. సుమన్ బాబు నియామకం!
Ramagundam: వినియోగదారుల హక్కుల పరిరక్షణతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కన్జ్యూమర్ రైట్స్ కమిటీ నిరంతరం కృషి చేస్తుందని పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మడ్డి శ్రావణ్ తెలిపారు.
సోమవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో రామగుండం నియోజకవర్గ కన్జ్యూమర్ రైట్స్ కమిటీ నూతన సభ్యుల నియామక కార్యక్రమం నిర్వహించారు.
జిల్లా అధ్యక్షుడు మడ్డి శ్రావణ్ ఆధ్వర్యంలో నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు. రామగుండం నియోజకవర్గ అధ్యక్షుడిగా ఎస్. సుమన్ బాబు, ఉపాధ్యక్షుడిగా ఎం. శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా ఏ. శ్రీధర్, మండల అధ్యక్షుడిగా వి. శ్రీనివాస్, టౌన్ అధ్యక్షుడిగా పి. శ్రీనివాస్, టౌన్ ఉపాధ్యక్షుడిగా ఎండీ అబ్దుల్ రషీద్‌లను నియమించారు.
ఈ సందర్భంగా మడ్డి శ్రావణ్ మాట్లాడుతూ వినియోగదారుల హక్కులపై ప్రజలకు అవగాహన కల్పించడమే కమిటీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. మార్కెట్లో వస్తువులను అధిక ధరలకు విక్రయించడం, హోటళ్లు, రెస్టారెంట్లలో నాణ్యత లేని ఆహార పదార్థాలు అందించడం, ఇతర వినియోగదారుల హక్కుల ఉల్లంఘనలకు పాల్పడటం వంటి సమస్యలు ఎదురైతే తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు. బాధితులకు న్యాయం జరిగేలా సంబంధిత అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
అలాగే రానున్న రోజుల్లో కన్జ్యూమర్ రైట్స్ కమిటీ ఆధ్వర్యంలో పలు స్వచ్ఛంద, సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. డిసెంబర్ 24న నిర్వహించనున్న జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా కవులు, కళాకారులు, సామాజిక సేవకులు, వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన ప్రముఖులను గుర్తించి అవార్డులతో సత్కరించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్గనైజర్ జి. ప్రశాంత్, జిల్లా జాయింట్ సెక్రటరీ ఎండీ షఫీ, సంజయ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.




