Sircilla: దాదాపు పదేళ్ల తర్వాత సిరిసిల్ల ఆర్టీసీ డిపోలో ప్రశాంతంగా సాగుతున్న పోలింగ్!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో పదేళ్ల తర్వాత అధ్యక్ష, కార్యదర్శి పదవుల కోసం పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది.

KALEEM, SIRICILLA
Published on: 9 Oct 2026 12:06 PM IST
Sircilla
X

Sircilla: దాదాపు పదేళ్ల తర్వాత సిరిసిల్ల ఆర్టీసీ డిపోలో ప్రశాంతంగా సాగుతున్న పోలింగ్!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో అధ్యక్ష, కార్యదర్శి పదవుల కోసం ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. దాదాపు పదేళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతుండటంతో ఆర్టీసీ కార్మికుల్లో ఉత్సాహం నెలకొంది. సిరిసిల్ల డిపో పరిధిలో మొత్తం 208 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ఎన్నికల్లో 34,999 ఓట్లు ఉండగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 11 డిపోల పరిధిలో 2,770 ఓట్లు ఉన్నాయి. ఎన్నికల్లో విజయం సాధించిన వారు రెండేళ్లపాటు అధ్యక్ష, కార్యదర్శి పదవుల్లో కొనసాగనున్నారు.

కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ఆర్టీసీ ఆస్తులను పరిరక్షించాలని, కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మికులు కోరుతున్నారు.

సిరిసిల్ల డిపోలో ఉదయం 5 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ తెలిపారు. ఈ నెల 14, 15 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ నిర్వహించిన అనంతరం, 17వ తేదీన తుది ఫలితాలు వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA