Sircilla: మహిళల పట్ల అసభ్య ప్రవర్తన.. సయ్యద్ జుబేర్‌పై రౌడీ షీట్ ఓపెన్!
Sircilla: మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్న ఎల్లారెడ్డిపేట వాసి సయ్యద్ జుబేర్‌పై రౌడీ షీట్ ఓపెన్ చేసినట్లు డీఎస్పీ నాగేంద్ర చారి తెలిపారు.
Sircilla: మహిళల పట్ల అసభ్య ప్రవర్తన.. సయ్యద్ జుబేర్‌పై రౌడీ షీట్ ఓపెన్!
Sircilla: మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడుతున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని సిరిసిల్ల డీఎస్పీ కె. నాగేంద్ర చారి హెచ్చరించారు. ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన సయ్యద్ జుబేర్ నేర ప్రవృత్తిని పరిగణనలోకి తీసుకొని అతనిపై రౌడీ షీట్ ఓపెన్ చేసినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా డీఎస్పీ కె. నాగేంద్ర చారి మాట్లాడుతూ.. ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా వ్యవహరించే వారిని, ముఖ్యంగా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వ్యక్తులను ఉపేక్షించేది లేదన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
మహిళలు ఎలాంటి వేధింపులకు గురైనా భయపడకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలని డీఎస్పీ సూచించారు. మహిళల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, ప్రజలకు ఇబ్బందులు కలిగించే వ్యక్తులపై నిరంతరం నిఘా ఉంచుతామని తెలిపారు.




