Metpally: మాజీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డికి ఘన నివాళులు
Metpally: జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మాజీ ఎమ్మెల్యే తుమ్మల వెంకట రమణారెడ్డి 18వ వర్ధంతి సందర్భంగా బీజేపీ శ్రేణులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Metpally: మాజీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డికి ఘన నివాళులు
మెట్టుపల్లి: మాజీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి దాము వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన బిజెపి శ్రేణులు* మెట్టుపల్లి మాజీ శాసనసభ్యులు తుమ్మల వెంకట రమణారెడ్డి 18వ వర్ధంతి సందర్భంగా బిజెపి శ్రేణులు ఆయన అభిమానులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు ధోనికెలనవీన్ మాట్లాడుతూ శాసన సభ్యునిగా మెట్టుపల్లి ప్రాంత ప్రజలకు నిస్వార్ధంగా సేవలు అందించి తమ ఆస్తులను అమ్ముకొని ప్రజల కోసం ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడిన గొప్ప నాయకుడు వెంకటరమణారెడ్డి అని కొనియాడారు. వారి ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్డేపల్లి శ్రీనివాస్, జిల్లా డాక్టర్ సెల్ కన్వీనర్, డాక్టర్ గంగసాగర్, బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి జుంగుల అనిల్ గౌడ్, బత్తుల జగదీష్, కలికోట శ్రీకాంత్, పట్టణ ఉపాధ్యక్షుడు లోలపు అనిల్, బొడ్ల ఆనంద్ ,గుంటుక హనుమాన్లు బొడ్ల అనిల్, తిరుచుల్లా అర్జున్ కొల్లిపు శ్రీనివాస్, పారుపల్లి గంగాధర్, సంకు ప్రసాద్, శంభోజి, శ్రీధర్, ఆచారి గుండు, మోహన్ గుండు, ప్రభాకర్ ముక్క నరేష్, ఇల్లందుల కృష్ణమాచారి, తోకల సత్యనారాయణ, సుంకే అశోక్, మొగిలిపాక హరికృష్ణ ,మేము రి వరలక్ష్మి, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు గోపనవేని రమేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి గుండవైన శేఖర్, మరియు బిజెపి బీజేవైఎం కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




