Peddapalli: పెద్దపల్లి దేవునిపల్లి శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయ విశిష్ట చరిత్ర!
Peddapalli: పెద్దపల్లి మండలం దేవునిపల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయ ఆవిర్భావ చరిత్ర, పడమర ముఖ ఆలయ విశిష్టతను ప్రధాన అర్చకులు వివరించారు.
Peddapalli: పెద్దపల్లి దేవునిపల్లి శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయ విశిష్ట చరిత్ర!
పెద్దపల్లి: పెద్దపల్లి మండలం దేవునిపల్లి గ్రామంలో కొలువుదీరిన శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయ చరిత్ర ఎంతో విశిష్టమైనది. ఈ ఆలయం ఎలా ఏర్పడిందో ఆలయ ప్రధాన అర్చకులు వివరించారు.
కొండపై నుంచి భారీ రాయి దొర్లుకుంటూ వచ్చి సమీపంలోని ఇళ్లపై పడకుండా వాలు అంచు వద్ద ఆగి, రెండు ముక్కలుగా విరిగి స్వామివారు ఉద్భవించారని స్థలపురాణం చెబుతోంది.
మరుసటి రోజు స్వామి ఒక గ్రామస్తుడి కలలో కనిపించి ఆలయం నిర్మించమని కోరగా, ఉదయం వెళ్లి చూడగా కొండ గుహలో స్వామి నామాలు మరియు పాదముద్రలు కనిపించాయని భక్తులు విశ్వసిస్తున్నారు.
ఈ ఆలయాన్ని జైనులు నిర్మించారని చరిత్రకారుల అభిప్రాయం. సాధారణంగా హిందూ దేవాలయాలు తూర్పు దిక్కుగా ఉంటాయి, కానీ ఇక్కడి దేవాలయాలు పడమర వైపు ఉండటం ప్రత్యేకత.
ప్రధాన ఆలయం కొండపై ఉండగా, కొండ కింద మరో రెండు దేవాలయాలు నిర్మించారు. ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు ఉమ్మడి జిల్లా నుండి అనేక మంది భక్తులు వస్తుంటారు.




