Peddapalli: గోదావరిఖనిలో ఘనంగా ముగిసిన సింగరేణి ఫుట్‌బాల్ టోర్నమెంట్ పోటీలు!
Peddapalli: గోదావరిఖని జేఎన్‌ఎన్ స్టేడియంలో నిర్వహించిన సింగరేణి కంపెనీ స్థాయి ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో ఆర్జీ-1 & ఆర్జీ-2 సంయుక్త జట్టు విజేతగా నిలిచింది.
Peddapalli: గోదావరిఖనిలో ఘనంగా ముగిసిన సింగరేణి ఫుట్‌బాల్ టోర్నమెంట్ పోటీలు!
Peddapalli: గోదావరిఖనిలోని జవహర్‌లాల్ నెహ్రూ (జేఎన్‌ఎన్) స్టేడియంలో WPS&GA ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించిన సింగరేణి కంపెనీ స్థాయి ఫుట్‌బాల్ టోర్నమెంట్ గురువారం వైభవంగా ముగిసింది.
సింగరేణి పరిధిలోని 11 ఏరియాల జట్లు హోరాహోరీగా తలపడిన ఈ పోటీల ఫైనల్ మ్యాచ్‌లో ఆర్జీ-1 & ఆర్జీ-2 సంయుక్త జట్టు విజేతగా నిలవగా, మందమర్రి & బెల్లంపల్లి జట్టు రన్నరప్‌గా నిలిచింది. ముగింపు వేడుకలకు రామగుండం ఏరియా-1 జనరల్ మేనేజర్ డి. లలిత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు, రన్నరప్ జట్లకు ట్రోఫీలు, పతకాలు అందజేశారు.
ఈ సందర్భంగా జీఎం డి. లలిత్ కుమార్ మాట్లాడుతూ, క్రీడలు శారీరక దృఢత్వాన్ని మాత్రమే కాకుండా మానసిక స్థైర్యాన్ని, క్రమశిక్షణను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. సింగరేణిలోని 40 వేల మంది ఉద్యోగులకు ప్రతినిధులుగా నిలిచి క్రీడాకారులు అద్భుత ప్రతిభ చాటారని కొనియాడారు.
సంస్థ సీఎండీ బుద్ధప్రకాష్, డైరెక్టర్ గౌతం పొట్రు క్రీడలను విశేషంగా ప్రోత్సహిస్తూ అవసరమైన నిధులు, వసతులు సమకూరుస్తున్నారని గుర్తుచేశారు. పనిలో ఎంత నిబద్ధతతో ఉంటామో, ఆటల్లోనూ అదే ఉత్సాహాన్ని చూపాలని, ఇక్కడ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు జాతీయ స్థాయిలో కోల్ ఇండియా పోటీల్లో పాల్గొని సంస్థ పతాకాన్ని ఎగురవేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఆర్జీ-1 సేవా అధ్యక్షురాలు అనిత లలిత్ కుమార్, క్వాలిటీ జీఎం వెంకటరమణ, సేఫ్టీ జీఎం మల్లయ్య, రెస్క్యూ జీఎం శ్రీనివాసరెడ్డి, ఎస్వో టు జీఎం చంద్రశేఖర్, ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ రంగు శ్రీనివాస్, ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధులు క్రాంతి కుమార్, మల్లేష్, డిప్యూటీ పర్సనల్ మేనేజర్ వేణు,
స్పోర్ట్స్ గౌరవ కార్యదర్శి హనుమంతరావు, సేవా ప్రతినిధులు బీనాసింగ్, రజిత, మణి, భాస్కరి, లేడీస్ క్లబ్ కార్యదర్శి శిరీష, అధికారులు చిలుక శ్రీనివాస్, గీతేందర్ సింగ్, వరప్రసాద్, కుమారస్వామి, శ్రావణ్, స్పోర్ట్స్ సూపర్‌వైజర్లు నరేందర్ రెడ్డి, అశోక్, శ్రీనివాస్, పోసనెట్టి, గాండ్ల రాజయ్య, తెలంగాణ ఫుట్‌బాల్ అసోసియేషన్ రిఫరీలు విజయ్‌కుమార్, రేవంత్, వంశీ, దినేష్ తదితరులు పాల్గొన్నారు.




