Siricilla: పదవీ విరమణ పొందిన పారిశుద్ధ్య కార్మికుడికి సన్మానం!
Siricilla: ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్ పంచాయతీలో తొమ్మిదేళ్లుగా పారిశుద్ధ్య కార్మికుడిగా సేవలందించి పదవీ విరమణ పొందిన మల్యాల బాబును సర్పంచ్ నాగరాజ్ యాదవ్ సన్మానించారు.
Siricilla: పదవీ విరమణ పొందిన పారిశుద్ధ్య కార్మికుడికి సన్మానం!
Siricilla: ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్ గ్రామపంచాయతీలో తొమ్మిదేళ్లుగా పారిశుద్ధ్య కార్మికుడిగా సేవలందించిన మల్యాల బాబు పదవీ విరమణ సందర్భంగా సర్పంచ్ చిర్రం నాగరాజ్ యాదవ్, పాలకవర్గ సభ్యులు ఘనంగా సన్మానించారు.
హరిదాస్ నగర్ గ్రామపంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుడిగా విధులు నిర్వహించిన మల్యాల బాబు పదవీ విరమణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ చిర్రం నాగరాజ్ యాదవ్, పాలకవర్గ సభ్యులు ఆయనను శాలువాతో సత్కరించి, రూ.3,000 నగదు అందజేశారు.
గ్రామంలో తొమ్మిదేళ్ల పాటు పారిశుద్ధ్య సేవలు అందించిన బాబు సేవలను ఈ సందర్భంగా సర్పంచ్, పాలకవర్గ సభ్యులు అభినందించారు.




