Eligedu: ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అభివృద్ధి పనులు: ఎంపీ గడ్డం

Eligedu: ఎలిగేడు మండల కేంద్రంలో రూ.5 లక్షల ఎంపీ ల్యాడ్స్ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ భూమిపూజ చేశారు.

RAJU, PEDDAPALLI
Published on: 10 Nov 2026 2:12 PM IST
Eligedu
X

Eligedu: ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అభివృద్ధి పనులు: ఎంపీ గడ్డం

Eligedu: ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఎలిగేడు మండల కేంద్రంలో రూ.5 లక్షల ఎంపీ ల్యాడ్స్ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎంపీ భూమిపూజ చేశారు.

రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని గతంలో కాలనీవాసులు ఎంపీ దృష్టికి తీసుకురాగా, వెంటనే స్పందించి తన ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి రూ.5 లక్షలు మంజూరు చేశారు. ఈ నేపథ్యంలో రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించడంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు.

తమ సమస్యను గుర్తించి వెంటనే నిధులు మంజూరు చేసి రోడ్డు నిర్మాణానికి సహకరించిన ఎంపీ గడ్డం వంశీకృష్ణకు కాలనీవాసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

RAJU, PEDDAPALLI

RAJU, PEDDAPALLI