Sircilla: ప్రజావాణి అర్జీలను త్వరగా పరిష్కరించాలి: అదనపు కలెక్టర్
Sircilla: రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్ ప్రజావాణిలో 66 అర్జీలు వచ్చాయని, దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టకుండా త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు.
Sircilla: ప్రజావాణి అర్జీలను త్వరగా పరిష్కరించాలి: అదనపు కలెక్టర్
రాజన్న సిరిసిల్ల జిల్లా: రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 66 దరఖాస్తులు స్వీకరించినట్లు జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ తెలిపారు. ప్రజలు సమర్పించే దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
ప్రజావాణి కార్యక్రమానికి హాజరైన అదనపు కలెక్టర్ ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు. ప్రతి దరఖాస్తును పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కార చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.
ఆర్డీఓ కార్యాలయాల్లో 7 దరఖాస్తులు
సిరిసిల్ల ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి 5 దరఖాస్తులు రాగా, వేములవాడ ఆర్డీఓ కార్యాలయంలో 2 దరఖాస్తులు వచ్చాయి. ఆయా దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు అందజేసి పరిష్కరించాలని ఆదేశించారు.
మండల కార్యాలయాల్లో దరఖాస్తుల వివరాలు
జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీఓ కార్యాలయాల్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని ఎంపీడీఓల ఆధ్వర్యంలో నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
మండలాల వారీగా బోయినపల్లి 2, చందుర్తి 0, ఇల్లంతకుంట 5, గంభీరావుపేట 5, కోనరావుపేట 0, ముస్తాబాద్ 6, రుద్రంగి 1, తంగళ్లపల్లి 3, వీర్నపల్లి 2, వేములవాడ అర్బన్ 0, వేములవాడ రూరల్ 2, ఎల్లారెడ్డిపేట 1 దరఖాస్తు వచ్చాయి.




