Karimnagar: కరీంనగర్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ లక్ష్మణ్‌రావుకు ఘన సన్మానం!
Karimnagar: కరీంనగర్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్‌గా ఎన్నికైన లక్ష్మణ్‌రావుకు అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఘన సన్మానం. ప్రజా సేవకే నా తొలి ప్రాధాన్యత: లక్ష్మణ్‌రావు.
Karimnagar: కరీంనగర్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ లక్ష్మణ్‌రావుకు ఘన సన్మానం!
Karimnagar: కరీంనగర్ పట్టణ రెడ్ క్రాస్ సొసైటీ లో జరిగిన ఎన్నికలలో గెలిచి చైర్మన్ గా ఎన్నికైన లక్ష్మణ్ రావు ను కరీంనగర్ అఖిల బ్రాహ్మణ సేవా సంఘం సన్మానించింది. వారు చేస్తున్నటువంటి సేవలు కొనేయాడుతూ వారికి పెద్ద ఎత్తున సన్మానం చేశారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ రెడ్ క్రాస్ సొసైటీకి చైర్మన్గా తాను ఎన్నిక కావడం ఎంతో సంతోషంగా ఉంది అన్నారు తన గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు.
రెడ్ క్రాస్ సొసైటీ సేవలు ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా తాను కృషి చేస్తానని తెలిపారు తమ సంఘం వారు తనకు సన్మానం చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు తన సంఘానికి,కులానికి మరింత సేవ చేయాల్సిన బాధ్యత తనకు ఉందని సందర్భంగా వారు తెలియజేశారు.
ఈ కార్యక్రమాల్లో సంఘ అధ్యక్షులు జీవీ రంగారావు ప్రధాన కార్యదర్శి పురం ప్రేమ్చందర్రావు అదేవిధంగా రాఘవేంద్ర సత్య ప్రధాన ట్రస్ట్ చైర్మన్ శ్రీ పెండ్యాల ఆనంద్ ట్రస్ట్ ప్రతినిధులు శ్రీనివాసరావు సంజీవరావు అదేవిధంగా సంఘ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో సంఘ సీనియర్ నాయకులు చంద్రమౌళి ,రామారావు ఎర్రబాటి రంగారావు శశికాంత్ సిహెచ్ కృష్ణ మోహన్ శ్రీ చరణ్, రవితేజ, రాము, రాజేశ్వరద్వాజ్ ,విజయ కుమార్ వెంకటేశ్వరరావు గోపాలరావు, గర్శకుతి శ్రీనివాస్ రావు.. శ్రీధర్ రావు తదితరులు పెద్ద ఎత్తున హాజరైన కార్యక్రమం విజయవంతం చేసినారు.




