Peddapalli: హైదరాబాద్ సదర్ వేడుకల్లో పాల్గొన్న పెద్దపల్లి యాదవ సంఘం అధ్యక్షుడు!

Peddapalli: హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించిన సదర్ సమ్మేళన వేడుకల్లో పెద్దపల్లి జిల్లా రియల్ ఎస్టేట్, యాదవ సంఘం అధ్యక్షులు పెగడ రమేష్ యాదవ్ పాల్గొన్నారు.

RAJU, PEDDAPALLI
Published on: 5 Nov 2026 7:32 AM IST
Peddapalli
X

Peddapalli: హైదరాబాద్ సదర్ వేడుకల్లో పాల్గొన్న పెద్దపల్లి యాదవ సంఘం అధ్యక్షుడు!

Peddapalli: హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఘనంగా నిర్వహించిన సదర్ వేడుకల్లో పెద్దపల్లి జిల్లా రియల్ ఎస్టేట్ మరియు యాదవ సంఘం అధ్యక్షులు పెగడ రమేష్ యాదవ్ పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా ప్రతి ఏటా నిర్వహించే సదర్ ఉత్సవాల్లో భాగంగా ఈసారి కూడా యాదవులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దున్నపోతుల ప్రదర్శన, యాదవుల సాంస్కృతిక వేడుకలు ఆకట్టుకున్నాయి.

ఈ వేడుకల్లో పాల్గొన్న పెగడ రమేష్ యాదవ్ మాట్లాడుతూ సదర్ వేడుకలు యాదవుల ఆత్మగౌరవానికి ప్రతీక అని, యాదవ సంస్కృతిని భావితరాలకు అందించేందుకు ఇలాంటి వేడుకలు ఎంతో అవసరమని అన్నారు. యాదవుల ఐక్యతను చాటే ఈ వేడుకలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుండి యాదవ సంఘం నాయకులు, యాదవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RAJU, PEDDAPALLI

RAJU, PEDDAPALLI