Thimmapur: వారంలోగా కరువు మండలాలుగా ప్రకటించకుంటే క్యాంప్ ఆఫీస్ ముట్టడి!
Thimmapur: మానకొండూర్ నియోజకవర్గాన్ని కరువు మండలాలుగా ప్రకటించడంలో ఎమ్మెల్యే వైఫల్యం. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. కమీషన్లపై ఉన్న ధ్యాస రైతులపై లేదని ధ్వజం.
Thimmapur: వారంలోగా కరువు మండలాలుగా ప్రకటించకుంటే క్యాంప్ ఆఫీస్ ముట్టడి!
తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యే కవ్వంపల్లికి కమీషన్లపైన ఉన్న సోయి నియోజకవర్గ రైతులపై, కరువు మండలాల ప్రకటనపై లేదని రసమయి అన్నారు. రైతులు వరి సాగు చేయవద్దని సీఎం ప్రకటన చేస్తుంటే నియోజకవర్గంలోని అన్నీ మండలాల పేర్లు ఎందుకు రాలేదని రసమయి ప్రశ్నించారు.
అన్నీ మండలాలను కరువు మండలాలుగా ప్రకటేంచేలా ఎమ్మెల్యే కవ్వంపల్లి వెంటనే చర్యలు చేపట్టాలని, అవసరమైతే తాము మద్దతునిస్తామని తెలిపారు. నియోజకవర్గంలో ప్రాజెక్టులున్నా ఎలినినో ప్రభావంత ఉంటుదంని తెల్సినా నీటిని నిల్వ చేయలేకపోవడం ఎమ్మెల్యే వైఫల్యమేనని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో తాము ఎండల్లో సైతం నీళ్లు ఇచ్చామని గుర్తు చేశారు. నియోజకవర్గాన్ని గాలికి వదిలేసి కమీషన్ల కోసం ఆరాటపడుతున్నాడని, ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో తన్నుకుంటున్నారని ఆరోపించారు.
వారంలోగా కరువు మండలాలుగా ప్రకటన చేయించకుంటే ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసును ముట్టడిస్తామని రసమయి హెచ్చరించారు. కరువు వస్తున్న నేపథ్యంలో భూగర్భజలాలు అడుగంటకుండా నియోజకవర్గంలో ఇసుక రీచ్ లను వెంటనే ఆపేయాలని డిమాండ్ చేశారు. రైతులను డిక్లరేషన్ అడుగుడంపై రసమయి మండిపడ్డారు.
ఈ సమావేశంలో బిఅర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి , పలు మండలాల బిఅర్ఎస్ అధ్యక్షులు రావుల రమేష్ ,తాళ్లపెల్లి, శేఖర్ గౌడ్, పాకాల మహిపాల్ రెడ్డి,గంప వెంకన్న, నాయిని వెంకట్ రెడ్డి,సర్పంచులు తాట్ల తిరుపతి,అవుదుర్తి రాం కిషన్, ఎడ్ల బుచ్చిరెడ్డి,కరివేద జనార్దన్ రెడ్డి,లింగాల లక్ష్మణ్,బోయిని కొమురయ్య, గుజ్జుల ప్రణీత్ రెడ్డి,గాండ్ల శ్రీనివాస్, మేకల మహేష్, గడ్డి రమేష్ ,మా శెట్టి శివకృష్ణ, సుధాగోని సదయ్య,గాజ సాగర్, బిఅర్ఎస్ నాయకులు తరితరులు పాల్గొన్నారు.




