Ramagundam: 48 ఏళ్లు పూర్తి చేసుకున్న రామగుండం ఎన్టీపీసీ

Ramagundam: పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ నేటితో 48 ఏళ్లు పూర్తి చేసుకుని 49వ వసంతంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం 4,486 మెగావాట్ల ఉత్పత్తితో అతిపెద్ద హబ్‌గా నిలిచింది.

VIJAY, RAMAGUNDAM
Published on: 14 Nov 2026 10:53 PM IST
Ramagundam
X

Ramagundam: 48 ఏళ్లు పూర్తి చేసుకున్న రామగుండం ఎన్టీపీసీ

రామగుండం: రామగుండం ఎన్టీపీసీ తో పాటు తెలంగాణ సూపర్ ధర్మల్ పవర్ ప్రాజెక్టు తొలి దశలో 800 మెగవాట్ల సామర్థ్యంతో రెండు యూనిట్లు పూర్తి చేసుకుని విద్యుత్ ఉత్పత్తి సాధిస్తుంది. రెండోదశలో ఒక్కోటి 800 మెవాట్ల సామర్థ్యంతో మూడు యూనిట్ల నిర్మా ణానికి ఇటీవల అధికారులు శ్రీకారం చుట్టారు.

అలాగే స్వచ్చ ఇంధనంలో 130 మెగావాట్ల గ్రౌండ్ మౌంటెడ్, 156 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకొని ఉత్పత్తి ని సాధించింది.న్2026 జూన్ 13న 100 ఎండబ్ల్యూహెచ్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టము కు కూడా శంకుస్థాపన చేశారు.

ప్రస్తుతం రామగుండం ఎన్టీపీసీ థర్మల్ ద్వారా 4200, సోలార్ ద్వారా 286 మెగావాట్లు కలిపి 4,486 మెగావాట్ల ఉత్పత్తితో అతిపెద్ద హబ్ గా ఏర్పడింది. తెలంగాణ స్టేజీ-2 పూర్తయితే 6,886 మెగావాట్లతో అతి పెద్ద విద్యుత్ ప్రాజెక్టుగా రామగుండం అతిపెద్ద విద్యుత్ ప్రాజెక్టుగా ఆవిర్భవించనుంది.

అంతేకాక భద్రతలో ఐఈఐ-ఎస్ క్యూఎఫ్ 23వ అంతర్జాతీయ భద్రతా సదస్సు -2026లో సేఫ్టీ ఇన్నోవేషన్ అవార్డు-2026 ను కూడా అందుకుంది. విద్యుత్ ఉత్పత్తి తో పాటు సామాజిక బాధ్యత కింద ప్రభావిత గ్రామాల అభివృద్ధి తో పాటు పచ్చదనం పరిశుభ్రత పై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు అధికారులు తెలిపారు.

VIJAY, RAMAGUNDAM

VIJAY, RAMAGUNDAM