Ramagiri: రత్నాపూర్‌లో అలుగు పిల్లి కలకలం అటవీశాఖకు అప్పగించిన స్థానికులు
Ramagiri: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రత్నాపూర్‌లో కనిపించిన అరుదైన అలుగు (పాంగోలిన్). సురక్షితంగా పట్టుకుని అటవీశాఖ అధికారులకు అప్పగించిన స్థానికులు.
Ramagiri: రత్నాపూర్‌లో అలుగు పిల్లి కలకలం అటవీశాఖకు అప్పగించిన స్థానికులు
రామగిరి: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రత్నాపూర్ గ్రామంలో అరుదైన అలుగు చేప స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. గ్రామంలోని బస్టాండ్ సమీపంలో ఈ అలుగు చేపను స్థానికులు రాత్రి గుర్తించారు.
వెంటనే అప్రమత్తమైన స్థానికులు దానిని ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తగా పట్టుకుని అటవీశాఖ అధికారులకు అప్పగించారు.
సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు అలుగు చేపను స్వాధీనం చేసుకుని తదుపరి చర్యలు చేపట్టారు. అరుదైన జీవి గ్రామ పరిసరాల్లో కనిపించడంతో స్థానికుల్లో ఆసక్తి నెలకొంది.




