Sircilla: రాచర్ల గొల్లపల్లిలో యూపీ కూలీ దారుణ హత్య!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా రాచర్ల గొల్లపల్లిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన వలస కూలీ పవన్ సింగ్ హత్యకు గురయ్యాడు. వివాదం వల్లే హత్య జరిగిందని పోలీసులు కేసు నమోదు చేశారు.

KALEEM, SIRICILLA
Published on: 14 Oct 2026 7:39 PM IST
Sircilla
X

Sircilla: రాచర్ల గొల్లపల్లిలో యూపీ కూలీ దారుణ హత్య!

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలో దారుణం చోటుచేసుకుంది. బతుకుదెరువు కోసం ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన పవన్ సింగ్ అనే యువకుడు హత్యకు గురయ్యాడు. ఇద్దరు యువకుల మధ్య జరిగిన వివాదం హత్యకు దారితీసినట్లు సమాచారం.

పవన్ సింగ్‌ను హత్య చేసిన అనంతరం అదే రాష్ట్రానికి చెందిన మరో యువకుడు పరారైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఎల్లారెడ్డిపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

హత్యకు దారితీసిన వివాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో రాచర్ల గొల్లపల్లిలో కలకలం రేగింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA