Sircilla: మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలి!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించగా జిందం కళ చక్రపాణి పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA
Published on: 21 Nov 2026 4:47 PM IST
Sircilla
X

Sircilla: మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలి!

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ వేడుకలను మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ చక్రపాణి ముఖ్య అతిథిగా, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ గౌరవ అతిథిగా హాజరయ్యారు. కౌన్సిలర్లు కూర భాగ్యలక్ష్మి దేవరాజు, చొప్పదండి ప్రకాష్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిందం కళ చక్రపాణి మాట్లాడుతూ.. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా మత్స్యకారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. వేడుకలను ఘనంగా నిర్వహించిన గంగపుత్ర సంఘం సభ్యులను అభినందించారు. మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ అవసరమైన పథకాలను రూపొందించాలని అన్నారు.

గత ప్రభుత్వ హయాంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పూడికతీత చేపట్టి, కొత్త రిజర్వాయర్ల నిర్మాణంతో జలవనరులను పెంపొందించారని గుర్తు చేశారు. చెరువులు, రిజర్వాయర్లలో చేప పిల్లలను వదలడం ద్వారా మత్స్యకారులకు ఉపాధి కల్పించడంతో పాటు, చేపల వ్యాపారం కోసం వాహనాలను కూడా అందించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ప్రతినిధులు, గంగపుత్ర సంఘాల సభ్యులు, పుర ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA