Illanthakunta: పేద ఆడబిడ్డ వివాహానికి టేకు మంచాలు అందజేసిన బిటిఆర్ ఫౌండేషన్

Illanthakunta: రాజన్న సిరిసిల్ల జిల్లా పత్తికుంటపల్లిలో పేద కుటుంబ ఆడబిడ్డ వివాహం సందర్భంగా బిటిఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బెంద్రం తిరుపతి రెడ్డి టేకు మంచాలను అందజేశారు.

KALEEM, SIRICILLA
Published on: 13 Nov 2026 1:52 PM IST
Illanthakunta
X

Illanthakunta: పేద ఆడబిడ్డ వివాహానికి టేకు మంచాలు అందజేసిన బిటిఆర్ ఫౌండేషన్

ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పత్తికుంటపల్లి గ్రామంలో పేద కుటుంబానికి చెందిన ఆడబిడ్డ వివాహానికి బెంద్రం తిరుపతి రెడ్డి చేయూత అందించారు. గ్రామానికి చెందిన స్వర్గీయ గుడిసె మల్లేష్ – లక్ష్మీ దంపతుల కుమార్తె వింద్య (రచన), పార్ష రాములుతో వివాహం సందర్భంగా BTR (Bendram Thirupathi Reddy) ఫౌండేషన్ ఆధ్వర్యంలో టేకు మంచాలను కళ్యాణ కానుకగా అందజేశారు.

ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు బెంద్రం తిరుపతి రెడ్డి మాట్లాడుతూ.. మండలంలోని పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు తమ ఫౌండేషన్ ద్వారా ఎల్లప్పుడూ కళ్యాణ కానుకలు, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. పేద కుటుంబాలకు అండగా నిలవడమే తమ ఫౌండేషన్ లక్ష్యమని పేర్కొన్నారు.

ఈ సేవా కార్యక్రమంలో ఫౌండేషన్ సేవా ప్రతినిధులు చింతలపెల్లి శ్రీనివాస్ రెడ్డి, చింతలపెల్లి ఎల్లారెడ్డి, గుర్రం వినోద్ రెడ్డి, పిసు చుక్కరెడ్డి, బొడ బాల్ రెడ్డి, మర్రిపెల్లి హరీశ్, ఎలుకపెల్లి సంపతి, ఓరుగంటి రవి, ఇరుమల్ల అంజి, తిప్పారపు రవి, ఇరుమల్ల కుంటయ్య, గజ్జల శ్రీనివాస్, కేశవేని భూమేష్, బట్టు లక్ష్మణ్, గుడిసె ఎల్లయ్య, ఓరుగంటి లచ్చయ్య, గుడిసె రాజయ్య, ఐలయ్య, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA