Sircilla: దీపావళిని సురక్షితంగా జరుపుకోవాలి ఎస్పీ మహేష్ బి. గీతే
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు దీపావళిని సురక్షితంగా జరుపుకోవాలని ఎస్పీ మహేష్ బి. గీతే సూచించారు. రోడ్డు భద్రత, టపాసుల నిబంధనలపై పోలీస్ శాఖ ఆదేశాలు.
Sircilla: దీపావళిని సురక్షితంగా జరుపుకోవాలి ఎస్పీ మహేష్ బి. గీతే
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో ఆనందంగా, సురక్షితంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతే సూచించారు. పండుగ వేళ టపాసులు కాల్చే ప్రాంతాల్లో వాహనదారులు అప్రమత్తంగా ప్రయాణించాలని, రోడ్లపై తొందరపాటు, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని కోరారు.
మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, కార్లలో ప్రయాణించేవారు సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్ వినియోగించకూడదని స్పష్టం చేశారు.
దీపావళి వేడుకల్లో చిన్నారుల పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, సురక్షితమైన, పర్యావరణహిత టపాసులనే వినియోగించాలని ఎస్పీ సూచించారు. ఒకరి ఆనందం మరొకరికి ప్రమాదంగా మారకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.
ప్రజలందరూ పోలీసుల సూచనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రమాదాలకు తావులేకుండా ఆనందంగా, సురక్షితంగా దీపావళి పండుగ జరుపుకోవాలని జిల్లా పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసింది.




