Sircilla: మృతి చెందిన ఏఆర్‌ఎస్‌ఐ కుటుంబానికి రూ.1.82 లక్షల ఆర్థిక సాయం

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా 17వ ఐఆర్ బెటాలియన్ ఏఆర్‌ఎస్‌ఐ జాటోత్ గోపి కుటుంబానికి తోటి సిబ్బంది సేకరించిన రూ.1.82 లక్షలను కమాండెంట్ అందజేశారు.

KALEEM, SIRICILLA
Published on: 25 Nov 2026 4:03 PM IST
Sircilla
X

Sircilla: మృతి చెందిన ఏఆర్‌ఎస్‌ఐ కుటుంబానికి రూ.1.82 లక్షల ఆర్థిక సాయం

రాజన్న సిరిసిల్ల జిల్లా: విధి నిర్వహణలో ఉండగా ఇటీవల మృతి చెందిన 17వ (ఐఆర్) పోలీస్ బెటాలియన్‌కు చెందిన ఏఆర్‌ఎస్‌ఐ జాటోత్ గోపి కుటుంబానికి తోటి సిబ్బంది అండగా నిలిచారు. సహచర కానిస్టేబుళ్లు, బెటాలియన్ సిబ్బంది కలిసి సేకరించిన రూ.1,82,000 ఆర్థిక సహాయాన్ని మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశారు.

2013 బ్యాచ్‌కు చెందిన గోపి సహచర కానిస్టేబుళ్లు, బెటాలియన్ సిబ్బంది స్వచ్ఛందంగా ఈ మొత్తాన్ని సేకరించారు. బెటాలియన్ కమాండెంట్ పి.జె.పి.సి. ఛటర్జీ ఈ ఆర్థిక సహాయాన్ని గోపి కుటుంబ సభ్యులకు అందించారు.

ఈ సందర్భంగా కమాండెంట్ మాట్లాడుతూ.. గోపి కుటుంబానికి బెటాలియన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. భవిష్యత్తులో ఏదైనా సహాయం అవసరమైనా బెటాలియన్ తరఫున ముందుండి సహకరిస్తామని హామీ ఇచ్చారు.

తోటి ఉద్యోగి కుటుంబం ఆపదలో ఉన్న సమయంలో సహచరులు, బెటాలియన్ సిబ్బంది ఐక్యతతో ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సహాయం పోలీసు సిబ్బందిలోని మానవతా దృక్పథానికి, పరస్పర సహకారానికి నిదర్శనంగా నిలిచింది.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA