Sircilla: ప్రజావాణి దరఖాస్తులు గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్!

Sircilla: రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్ ప్రజావాణికి 165 అర్జీలు వచ్చాయి. ప్రజల నుంచి అందిన దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.

KALEEM, SIRICILLA
Published on: 2 Nov 2026 4:41 PM IST
Sircilla
X

Sircilla: ప్రజావాణి దరఖాస్తులు గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్!

రాజన్న సిరిసిల్ల జిల్లా: ప్రజావాణికి వచ్చే దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. సోమవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఐడీఓసీ ప్రజావాణికి మొత్తం 165 దరఖాస్తులు రాగా, వాటిని సంబంధిత శాఖల అధికారులకు అందజేసి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణికి వచ్చే ప్రతి దరఖాస్తును పరిశీలించి, నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

ఆర్డీఓ కార్యాలయాల్లో 12 దరఖాస్తులు

సిరిసిల్ల ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి 6 దరఖాస్తులు రాగా, వేములవాడ ఆర్డీఓ కార్యాలయంలో 6 దరఖాస్తులు వచ్చాయి. వీటిని సంబంధిత శాఖల అధికారులకు అందజేసి పరిష్కరించాలని ఆదేశించారు.

మండలాల వారీగా 37 దరఖాస్తులు

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీఓ కార్యాలయాల్లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.

మండలాల వారీగా వచ్చిన దరఖాస్తుల వివరాలు ఇలా ఉన్నాయి. బోయినపల్లి మండలంలో 3, చందుర్తిలో 0, ఇల్లంతకుంటలో 9, గంభీరావుపేటలో 6, కోనరావుపేటలో 6, ముస్తాబాద్‌లో 5, రుద్రంగిలో 0, తంగళ్లపల్లిలో 2, వీర్నపల్లిలో 3, వేములవాడ అర్బన్‌లో 0, వేములవాడ రూరల్‌లో 1, ఎల్లారెడ్డిపేటలో 2 దరఖాస్తులు వచ్చాయి. మండలాల వారీగా మొత్తం 37 దరఖాస్తులు నమోదయ్యాయి.

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రెవెన్యూ డివిజన్, ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుందని, స్థానిక ప్రజలు తమ సమస్యలపై దరఖాస్తులు సమర్పించాలని కలెక్టర్ సూచించారు. అన్ని కార్యాలయాల్లో దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నట్లు తెలిపారు. ఐడీఓసీ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA