Sircilla: రాహుల్ గాంధీ, ఖర్గే చిత్రపటాలకు కాంగ్రెస్ శ్రేణుల పాలాభిషేకం!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేపట్టి రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే చిత్రపటాలకు పాలాభిషేకం చేసి ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశాయి.
Sircilla: రాహుల్ గాంధీ, ఖర్గే చిత్రపటాలకు కాంగ్రెస్ శ్రేణుల పాలాభిషేకం!
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రాజకీయ నిరసనలు, ప్రతినిరసనలతో వాతావరణం వేడెక్కింది. పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమం నిర్వహించాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సూర దేవరాజు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకువస్తూ పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. ఇలాంటి సమయంలో సిరిసిల్లలో బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేయడం సరికాదని అన్నారు. అభివృద్ధి, పెట్టుబడుల అంశాలపై చర్చించాల్సింది పోయి రాజకీయ నిరసనలకు దిగడం విచారకరమని వ్యాఖ్యానించారు.
రాహుల్ గాంధీపై బీజేపీ నాయకులు చేపట్టిన నిరసనకు ప్రతిగా కాంగ్రెస్ శ్రేణులు ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేసి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




