Sircilla: సిరిసిల్లలో NHM ఉద్యోగులకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు!

Sircilla: సిరిసిల్లలో నిరసన తెలుపుతున్న జాతీయ ఆరోగ్య మిషన్‌ (NHM) ఉద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సమస్యలను తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేసింది.

KALEEM, SIRICILLA
Published on: 26 Oct 2026 9:44 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్లలో NHM ఉద్యోగులకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు!

రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరిసిల్లలోని తెలంగాణ భవన్‌లో జిల్లాలో పనిచేస్తున్న జాతీయ ఆరోగ్య మిషన్‌ (NHM) ఉద్యోగులు తమ సమస్యలను బీఆర్ఎస్ పార్టీ నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం గత రెండు వారాలుగా రిలే నిరాహార దీక్షలు, నిరసనలు చేపడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు వివరించారు.

NHM ఉద్యోగుల డిమాండ్లు న్యాయబద్ధమైనవని పేర్కొన్న బీఆర్ఎస్ పార్టీ, వారి పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ కోరింది.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA