Sircilla: లిఖితపూర్వక హామీ ఇచ్చే వరకు సమ్మె విరమించం: ఎన్హెచ్ఎం!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల నిరవధిక సమ్మె 31వ రోజుకు చేరింది. లిఖితపూర్వక హామీ ఇచ్చే వరకు సమ్మె విరమించమని స్పష్టం చేశారు.

KALEEM, SIRICILLA
Published on: 12 Nov 2026 5:07 PM IST
Sircilla
X

Sircilla: లిఖితపూర్వక హామీ ఇచ్చే వరకు సమ్మె విరమించం: ఎన్హెచ్ఎం!

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల నిరవధిక సమ్మె గురువారం నాటికి 31వ రోజుకు చేరుకుంది. ఉద్యోగాల క్రమబద్ధీకరణ, సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత కల్పించే అంశాలపై ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇచ్చే వరకు సమ్మెను విరమించబోమని ఉద్యోగులు స్పష్టం చేశారు.

ప్రజారోగ్య వ్యవస్థలో కీలక సేవలు అందిస్తున్న NHM ఉద్యోగులందరినీ వెంటనే క్రమబద్ధీకరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ వేతనాలు, సేవా నిబంధనల్లో వ్యత్యాసం ఉండటం అన్యాయమని పేర్కొంటున్నారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నారు.

డిమాండ్ల సాధన కోసం రాజన్న సిరిసిల్ల జిల్లాలో NHM ఉద్యోగులు వరుస నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నల్ల బెలూన్లతో ర్యాలీ నిర్వహించి ప్రజలకు తమ సమస్యలను వివరించారు. ఎన్నో ఏళ్లుగా ఉద్యోగ భద్రత లేకుండానే ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నామని, ప్రభుత్వం మౌఖిక హామీలతో సరిపెట్టకుండా లిఖితపూర్వక హామీ ఇవ్వాలని సమ్మెలో పాల్గొంటున్న ఉద్యోగులు కోరుతున్నారు.

సమ్మె దీర్ఘకాలంగా కొనసాగుతుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో టీకాల కార్యక్రమాలు, గర్భిణులకు అందించే వైద్య సేవలు, ఇతర ప్రజారోగ్య కార్యక్రమాలపై ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది. NHM ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి న్యాయమైన పరిష్కారం చూపాలని NHM జేఏసీ నాయకులు కోరుతున్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA