Mustabad: ముస్తాబాద్ బంధనకల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి!

Mustabad: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బంధనకల్ వద్ద బైక్‌ను గుర్తుతెలియని డీసీఎం ఢీకొట్టడంతో కేసీఆర్ ఎర్రవెల్లి నివాసంలో పనిచేసే మణికుమార్ మృతి చెందారు.

KALEEM, SIRICILLA
Published on: 24 Nov 2026 7:26 AM IST
Mustabad
X

Mustabad: ముస్తాబాద్ బంధనకల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి!

ముస్తాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బంధనకల్ గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురిని గుర్తుతెలియని డీసీఎం వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవెల్లి నివాసంలో అటెండర్‌గా పనిచేస్తున్న మణికుమార్ మృతి చెందారు.

ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న భరత్, రాజేష్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి చేయి పూర్తిగా తెగిపోయినట్లు సమాచారం. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన డీసీఎం వాహనం వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA