Sircilla: సిరిసిల్లలో మొబైల్ వ్యాన్ ద్వారా న్యాయ విజ్ఞాన సదస్సులు!

Sircilla: ఆర్థిక కారణాలతో ఎవరూ న్యాయానికి దూరం కాకూడదని రాజన్న సిరిసిల్ల లోక్ అదాలత్ సభ్యులు ఆడెపు వేణు అన్నారు. కోనరావుపేట, వీర్నపల్లి మండలాల్లో న్యాయ సదస్సులు నిర్వహించారు.

KALEEM, SIRICILLA
Published on: 16 Oct 2026 6:35 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్లలో మొబైల్ వ్యాన్ ద్వారా న్యాయ విజ్ఞాన సదస్సులు!

సిరిసిల్ల: శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కోనరావుపేట మండల కేంద్రంలోని రైతు వేదికతో పాటు వీర్నపల్లి మండలంలోని గర్జనపల్లి, సీతారాంనాయక్ తండా గ్రామాల్లో న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కేటాయించిన మొబైల్ వ్యాన్ ద్వారా ఈ కార్యక్రమాలు చేపట్టారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి. నీరజ ఆదేశాలతో, సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పి. లక్ష్మణాచారి సమన్వయంతో సదస్సులు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆడెపు వేణు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి న్యాయం పొందే హక్కును కల్పించిందని తెలిపారు. ప్రజలకు న్యాయ హక్కులపై అవగాహన కల్పించడంతో పాటు న్యాయాన్ని అందరికీ చేరువ చేసేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కృషి చేస్తోందన్నారు. న్యాయపరమైన సమస్యల పరిష్కారానికి మధ్యవర్తిత్వం, లోక్ అదాలత్‌లను వినియోగించుకోవాలని సూచించారు. న్యాయ సహాయం అవసరమైన అర్హులు జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించి ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని తెలిపారు.

ఈ కార్యక్రమాల్లో లోక్ అదాలత్ సభ్యులు గుర్రం ఆంజనేయులు, కోనరావుపేట సర్పంచ్ కాశీరాం, ఎంఏఓ దుర్గారావు, గర్జనపల్లి సర్పంచ్ బి. రాకేష్ గౌడ్, సీతారాంనాయక్ తండా సర్పంచ్ బి. లత, పీఎల్‌వీలు దేవేంద్ర, లావణ్యతో పాటు గ్రామస్థులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA