Sircilla: సిరిసిల్ల రహదారిపై సొంత ఖర్చుతో గుంతలు పూడ్చిన సర్పంచ్!

Sircilla: సిరిసిల్ల–కామారెడ్డి రహదారిపై ప్రమాదకర గుంతలను ఎల్లారెడ్డిపేట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో హరిదాస్ నగర్ సర్పంచ్ చిర్రం నాగరాజు యాదవ్ సొంత ఖర్చులతో సీసీతో పూడ్చివేశారు.

KALEEM, SIRICILLA
Published on: 30 Oct 2026 12:05 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్ల రహదారిపై సొంత ఖర్చుతో గుంతలు పూడ్చిన సర్పంచ్!

సిరిసిల్ల: సిరిసిల్ల–కామారెడ్డి ప్రధాన రహదారిపై హరిదాస్ నగర్, పదిర గ్రామాల మధ్య ఉన్న బ్రిడ్జి వద్ద ప్రమాదకరంగా ఏర్పడిన మూడు భారీ గుంతలకు ఎల్లారెడ్డిపేట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మరమ్మతులు చేపట్టారు. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో లయన్స్ క్లబ్ సభ్యుడు, హరిదాస్ నగర్ గ్రామ సర్పంచ్ చిర్రం నాగరాజు యాదవ్ తన సొంత ఖర్చులతో సీసీ కాంక్రీట్ ద్వారా గుంతలను పూడ్చివేశారు.

హరిదాస్ నగర్ సర్పంచ్ చిర్రం నాగరాజు యాదవ్ సహకారంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట లయన్స్ క్లబ్ సభ్యులు సద్ది లక్ష్మారెడ్డి, వంగ శ్రీకాంత్, బందారపు లక్ష్మారెడ్డి, మేస్త్రి కిష్టారెడ్డి పాల్గొన్నారు.

ప్రధాన రహదారిపై ప్రమాదకరంగా మారిన గుంతలను పూడ్చివేయడంతో వాహనదారులకు ఇబ్బందులు తగ్గడంతో పాటు ప్రమాదాల నివారణకు దోహదపడుతుందని స్థానికులు పేర్కొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA