Sircilla: ఏఎంసీ చైర్మన్ వినయ్ కుమార్‌ను సత్కరించిన ట్రాక్టర్ యూనియన్!
Sircilla: ఇల్లంతకుంట మండల ఏఎంసీ చైర్మన్‌గా నియమితులైన అంతగిరి సాహిత్య వినయ్ కుమార్‌ను శ్రీ లక్ష్మి నర్సింహా ట్రాక్టర్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
Sircilla: ఏఎంసీ చైర్మన్ వినయ్ కుమార్‌ను సత్కరించిన ట్రాక్టర్ యూనియన్!
సిరిసిల్ల: ఇల్లంతకుంట మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్‌గా నియమితులైన అంతగిరి సాహిత్య వినయ్ కుమార్‌కు శ్రీ లక్ష్మి నర్సింహా ట్రాక్టర్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు.
శ్రీ లక్ష్మి నర్సింహా ట్రాక్టర్ యూనియన్ అధ్యక్షుడు గంగం అనిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నూతనంగా నియమితులైన ఏఎంసీ చైర్మన్ అంతగిరి సాహిత్య వినయ్ కుమార్‌ను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మామిడి సంజీవ్‌తో పాటు గడ్డం తిరుపతి, అంతటి రమేష్, దుర్గయ్య, దురశెట్టి పర్శరాం, మ్యాకల శంకర్, చెలిమిళ్ల మహేష్, సారా రమేష్, ప్రశాంత్, జక్కుల రమేష్, దయ్యల మహేష్, రామకృష్ణ, శ్రీనివాస్, కూనబోయిన దేవయ్య, సొల్లు లచ్చయ్య తదితర ట్రాక్టర్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.




