Sircilla: సిరిసిల్లలో TGGDA నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం!

Sircilla: రాజన్న సిరిసిల్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీలో తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం డీఎంహెచ్‌వో ఏంజెలా ఆల్ఫ్రెడ్ సమక్షంలో జరిగింది.

KALEEM, SIRICILLA
Published on: 6 Nov 2026 7:45 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్లలో TGGDA నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం!

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీలో తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (TGGDA) రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జిల్లా కార్యవర్గ సభ్యులు పదవీ బాధ్యతలు స్వీకరించారు.

నూతన జిల్లా అధ్యక్షుడిగా డా. నాగార్జున చక్రవర్తి, ప్రధాన కార్యదర్శిగా డా. సంతోష్ చారి, కోశాధికారిగా డా. సంతోష్ కుమార్ చీకోటి బాధ్యతలు చేపట్టారు. ఉపాధ్యక్షులుగా డా. జె. నాగన్న, డా. ఈ. బాబు, డా. ఎ. సాధన, జనరల్ కౌన్సిల్ సభ్యులుగా డా. ఆర్. శ్రీనివాస్, డా. జె. కాశీనాథ్, డా. ఎస్. దీప్తి బాధ్యతలు స్వీకరించారు. జాయింట్ సెక్రటరీలు, కార్యనిర్వాహక సభ్యులు సైతం ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (DMHO) డా. ఏంజెలా ఆల్ఫ్రెడ్ హాజరుకాగా, ఎన్నికల అధికారిగా డా. సుమన్ మోహన్ రావు వ్యవహరించారు. TGGDA కరీంనగర్ సభ్యులు డా. హరికృష్ణ, డా. రవి ప్రవీణ్, TTGDA అధ్యక్షుడు డా. బైరి లక్ష్మీనారాయణతో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన డా. బాబు, డా. నిర్విష తదితర వైద్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథులు నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. వైద్యుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ, వైద్యుల మధ్య ఐక్యతను బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వ వైద్య సేవల అభివృద్ధికి TGGDA కృషి చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లాలోని పలువురు వైద్యులు, సంఘ సభ్యులు పాల్గొని నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA