Sircilla: సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిరంజీల కొరత.. రోగుల అవస్థలు!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నెల రోజులుగా సిరంజీల కొరత వేధిస్తోంది. వైద్యం కోసం వచ్చే రోగులు బయట మెడికల్ షాపుల్లో సిరంజీలు కొనుగోలు చేస్తున్నారు.

KALEEM, SIRICILLA
Published on: 18 Nov 2026 2:40 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిరంజీల కొరత.. రోగుల అవస్థలు!

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సిరంజీల కొరత రోగులను ఇబ్బందులకు గురిచేస్తోంది. నెల రోజులుగా సిరంజీలు అందుబాటులో లేవని, వైద్యం కోసం ఆసుపత్రులకు వస్తున్న రోగులు బయట మెడికల్ షాపుల్లో సిరంజీలు కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సిరిసిల్ల పట్టణంలోని సుందరయ్య నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వైద్యం కోసం వస్తున్న రోగులకు ఇంజక్షన్ చేయాల్సి వస్తే బయట మెడికల్ షాపులో సిరంజీలు కొనుక్కుని రావాలని వైద్య సిబ్బంది చెబుతున్నట్లు రోగులు పేర్కొంటున్నారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా అందాల్సిన వైద్య సేవలకు అవసరమైన కనీస వైద్య పరికరాలు కూడా అందుబాటులో లేకపోవడంపై రోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలకు అవసరమైన అన్ని రకాల మందులు, వైద్య పరికరాలను అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత అధికారులపై ఉందని రోగులు అభిప్రాయపడుతున్నారు. సిరంజీల కొరతను వెంటనే పరిష్కరించి, ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు వచ్చే పేద రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్య సేవలు అందించాలని కోరుతున్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA