Sircilla: డిజిటల్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి: కలెక్టర్!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ 31 వరకు ఆర్థిక అక్షరాస్యత, డిజిటల్ మోసాలపై అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.

KALEEM, SIRICILLA
Published on: 16 Oct 2026 7:30 PM IST
Sircilla
X

Sircilla: డిజిటల్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి: కలెక్టర్!

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఈ నెల 21 నుంచి డిసెంబర్ 31 వరకు గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలో ఆర్థిక అక్షరాస్యత, డిజిటల్ మోసాల నుంచి రక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.

భారత ప్రభుత్వం ఆర్థిక సేవల విభాగం (DFS) ఆదేశాల మేరకు లీడ్ బ్యాంకు ఆధ్వర్యంలో జిల్లాలో నిర్వహించనున్న ఈ కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్లను శుక్రవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ గరిమ అగ్రవాల్, లీడ్ బ్యాంకు మేనేజర్ రాజీవ్ కుమార్‌తో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY), ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY), అటల్ పెన్షన్ యోజన (APY), అత్యంత వెనుకబడిన గిరిజన కుటుంబాల (PVTG) సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కొత్త బ్యాంకు ఖాతాల ప్రారంభానికి షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.

ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (PMJDY)తో పాటు ఇతర పొదుపు ఖాతాలకు రీ-కేవైసీ పూర్తి చేయించాలని, అవసరమైన చోట సెంట్రల్ కేవైసీ (CKYC) ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు. పొదుపు ఖాతాలు, బ్యాంకు లాకర్లకు నామినీలను నమోదు చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆర్థిక పథకాలపై అవగాహన పెంచడంతో పాటు డిజిటల్ మోసాల బారిన పడకుండా ప్రజలకు అవసరమైన సమాచారాన్ని అందించాలని కలెక్టర్ ఆదేశించారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA