Sircilla: సిరిసిల్ల జిల్లాలో ఎక్సైజ్ అధికారుల దాడులు ఇద్దరి అరెస్ట్!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో ఎక్సైజ్ అధికారుల దాడులు. ఇద్దరి అరెస్ట్, ఐదు లీటర్ల సారా, వంద లీటర్ల ఎఫ్‌జే వాష్ ధ్వంసం.

KALEEM, SIRICILLA
Published on: 7 Oct 2026 2:29 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్ల జిల్లాలో ఎక్సైజ్ అధికారుల దాడులు ఇద్దరి అరెస్ట్!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు ప్రత్యేక డ్రైవ్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా వీర్నపల్లి మండల పరిధిలోని నాలుగు గిరిజన తండాల్లో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మూడు కేసులు నమోదు చేసి, ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్, ఎస్‌హెచ్‌ఓ విజేందర్ రెండ్ల తెలిపారు.

ఏసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్‌తో కలిసి గర్జనపల్లి తండా, జవహర్‌లాల్ నెహ్రూ తండా, భూక్య రెడ్డి తండా, భంగిరెడ్డి తండాల్లో సంయుక్తంగా దాడులు చేపట్టారు. ఈ సందర్భంగా గర్జనపల్లి, జవహర్‌లాల్ నెహ్రూ తండాలకు చెందిన భూక్య సరిత, భూక్య భంకట్ లాల్‌ను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 5 లీటర్ల ఐడీ లిక్కర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

అదేవిధంగా అక్రమంగా తయారు చేస్తున్న 100 లీటర్ల ఎఫ్‌జే వాష్‌ను గుర్తించి, సంఘటనా స్థలంలోనే ధ్వంసం చేసినట్లు వెల్లడించారు. అక్రమ మద్యం తయారీ, విక్రయాలపై ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా దాడులు కొనసాగుతున్నాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.

ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సబ్‌ఇన్‌స్పెక్టర్ అభిషేక్, హెడ్ కానిస్టేబుల్ బాల్ రెడ్డి, కానిస్టేబుళ్లు మారుతి, శ్రవణ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ కానిస్టేబుళ్లు వర్మ, హమీద్, గణేష్, లత తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA