Sircilla: సిరిసిల్ల ప్రజలకు కలెక్టర్ గరిమ అగ్రవాల్ దసరా శుభాకాంక్షలు!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు, ఉద్యోగులకు జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.
Sircilla: సిరిసిల్ల ప్రజలకు కలెక్టర్ గరిమ అగ్రవాల్ దసరా శుభాకాంక్షలు!
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరికీ జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. దసరా పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, ప్రతి ఇంటా సిరిసంపదలు వెల్లివిరిసి, ప్రతి కుటుంబంలో సంతోషాలు నిండాలని ఆకాంక్షించారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి దసరా ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రజల జీవితాల్లో కష్టాలు తొలగి, ఆశలు, ధైర్యం, నూతనోత్సాహం నిండాలని కోరుకున్నారు. జిల్లా ప్రజలు తమ కుటుంబ సభ్యులు, ఆత్మీయులతో కలిసి దసరా పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని, ప్రతి కుటుంబంలో శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరియాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులకు కూడా ఆమె దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.




