Sircilla: ఢిల్లీ వాహనాలను ప్రారంభించిన డీసీసీ చీఫ్ సంగీతం శ్రీనివాస్!

Sircilla: ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించే కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి శ్రేణులు బయలుదేరాయి. డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు.

KALEEM, SIRICILLA
Published on: 30 Oct 2026 10:01 AM IST
Sircilla
X

Sircilla: ఢిల్లీ వాహనాలను ప్రారంభించిన డీసీసీ చీఫ్ సంగీతం శ్రీనివాస్!

రాజన్న సిరిసిల్ల: ఢిల్లీలో నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బయలుదేరారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) కార్యాలయం నుంచి జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన కాంగ్రెస్ శ్రేణులు ఢిల్లీకి పయనమయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ నాయకులకు జెండా ఊపి వారి ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఢిల్లీలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లడం సంతోషకరమని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రజాస్వామ్య పరిరక్షణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎల్లప్పుడూ ముందుండాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి నాయకుడు, కార్యకర్త సమష్టిగా కృషి చేయాలని సూచించారు. పార్టీ అధిష్ఠానం ఇచ్చే ప్రతి పిలుపును విజయవంతం చేయడంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ శ్రేణులు ముందుంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA