Gambhiraopet: గంభీరావుపేట హై లెవల్ బ్రిడ్జి పనులను త్వరగా పూర్తి చేయాలి!
Gambhiraopet: గంభీరావుపేట-లింగన్నపేట హై లెవల్ బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్ గరిమ అగ్రవాల్. 4 నెలల్లో పనులు పూర్తిచేయాలని అధికారులకు ఆదేశం.
Gambhiraopet: గంభీరావుపేట హై లెవల్ బ్రిడ్జి పనులను త్వరగా పూర్తి చేయాలి!
Gambhiraopet: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట–లింగన్నపేట మధ్య నిర్మిస్తున్న హై లెవల్ బ్రిడ్జి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు.
శుక్రవారం ఆర్ అండ్ బీ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిని సమీక్షించి, సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు కార్మికుల సంఖ్యను మరింత పెంచాలని సూచించారు. 160 మీటర్ల పొడవున బ్రిడ్జి నిర్మాణంతో పాటు, రెండు వైపులా కలిపి 300 మీటర్ల మేర అప్రోచ్ రోడ్ల పనులను నాలుగు నెలల్లో పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆదేశించారు.
అలాగే, వారం రోజుల్లోగా బ్రిడ్జి పక్క నుంచి అప్రోచ్ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేసి రాకపోకలను పునరుద్ధరించాలని సూచించారు. పనులు నిర్దేశిత గడువులోగా పూర్తయ్యేలా ఆర్ అండ్ బీ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ పరిశీలనలో ఆర్ అండ్ బీ ఈఈ భీమ్లానాయక్, డీఈ శాంతయ్య, తహసీల్దార్ మారుతిరెడ్డి, ఎంపీడీఓ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.




