Sircilla: వేములవాడ 80 ఫీట్ల రోడ్డు త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్!

Sircilla: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ 80 ఫీట్ల రోడ్డు, అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు.

KALEEM, SIRICILLA
Published on: 16 Oct 2026 6:20 PM IST
Sircilla
X

Sircilla: వేములవాడ 80 ఫీట్ల రోడ్డు త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్!

సిరిసిల్ల: వేములవాడ మూలవాగు బ్రిడ్జి నుంచి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వరకు చేపట్టనున్న 80 ఫీట్ల రోడ్డు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు.

శుక్రవారం వేములవాడలో వీటీడీఏ ఆధ్వర్యంలో చేపడుతున్న శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం విస్తరణ, అభివృద్ధి పనులు, నిత్యాన్నదాన సత్రం నిర్మాణం, బద్ది పోచమ్మ ఆలయ నిర్మాణం, 80 ఫీట్ల రోడ్డు పనుల పురోగతిపై ఆర్ అండ్ బీ, ఆలయ, మున్సిపల్, ఎన్‌పీడీసీఎల్ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల్లో మరింత వేగం పెంచాలని సూచించారు. 80 ఫీట్ల రోడ్డు నిర్మాణానికి సంబంధించి విద్యుత్ టవర్ల పనులను పూర్తి చేసి, రోడ్డు పనులను వేగంగా చేపట్టి పూర్తిచేయాలని ఆదేశించారు. బద్ది పోచమ్మ ఆలయ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు కార్మికుల సంఖ్యను పెంచాలని సూచించారు.

ఈ టెలీ కాన్ఫరెన్స్‌లో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఈఓ రమాదేవి, ఆర్ అండ్ బీ ఈఈ భీమ్లానాయక్, మున్సిపల్ కమిషనర్ లోకేష్, ఆలయ ఈఈ రాజేష్, ఎన్‌పీడీసీఎల్ అధికారులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA