Sircilla: వేసవి తాగునీటి సరఫరాపై సిరిసిల్ల కలెక్టర్ గరిమ అగ్రవాల్ సమీక్ష
Sircilla: ఎల్‌నినో ప్రభావం నేపథ్యంతో వేసవి ముగిసే వరకు తాగునీటి సరఫరాకు ఆటంకం కలగొద్దని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు.
Sircilla: వేసవి తాగునీటి సరఫరాపై సిరిసిల్ల కలెక్టర్ గరిమ అగ్రవాల్ సమీక్ష
రాజన్న సిరిసిల్ల: ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో రాబోయే వేసవి కాలం ముగిసే వరకు జిల్లాలో తాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు.
వేసవి కాల సన్నద్ధత, తాగునీటి సరఫరాకు చేపట్టాల్సిన చర్యలపై శుక్రవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మిషన్ భగీరథ అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తాగునీటి సరఫరా వ్యవస్థను పటిష్టంగా ఉంచేందుకు అవసరమైన ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.
అగ్రహారం, రుద్రవరం పంప్‌హౌస్‌లలోని పంపుసెట్లను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. తాగునీటి సరఫరాకు అవసరమైన యంత్రాలు, పరికరాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వేసవి కాలంలో నీటి సరఫరాలో అంతరాయం తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
సమావేశంలో మిషన్ భగీరథ ఎస్‌ఈ రాములు, ఈఈలు ముజాహిద్ అన్వర్, సుమలత, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు రాము, విశ్వన్ తదితరులు పాల్గొన్నారు.




