Sircilla: సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధిపై కలెక్టర్ గరిమ అగ్రవాల్ సమీక్ష!

Sircilla: సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధిపై కలెక్టర్ గరిమ అగ్రవాల్ సమీక్ష: ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తి, డైయింగ్ యూనిట్లు, పవర్‌లూమ్స్ ఆధునీకరణపై కీలక ఆదేశాలు.

KALEEM, SIRICILLA
Published on: 22 Sept 2026 9:59 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధిపై కలెక్టర్ గరిమ అగ్రవాల్ సమీక్ష!

సిరిసిల్ల: సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధి, ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తి, డైయింగ్ యూనిట్లు, పవర్‌లూమ్‌ల ఆధునీకరణ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మంగళవారం సమీక్ష నిర్వహించారు.

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సంబంధిత అధికారులు, వస్త్ర, పాలిస్టర్, చేనేత సంఘాల ప్రతినిధులతో సమావేశం జరిగింది. ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తి, సిరిసిల్లలో చిన్న తరహా డైయింగ్ యూనిట్ల అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పన తదితర అంశాలను ప్రతినిధులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలపై అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను సూచించారు.

సమావేశంలో ఏడీ హ్యాండ్లూమ్స్, టెక్స్‌టైల్స్ సంతోష్, టీజీఐఐసీ జోనల్ మేనేజర్ వై. మహేశ్వర్, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ భిక్షపతి, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ శ్రీనివాస్, సంబంధిత శాఖల అధికారులు, స్థానిక వస్త్ర, పాలిస్టర్, చేనేత సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA