Sircilla: రైతుల సమక్షంలోనే రీ సర్వే చేయాలి కలెక్టర్ గరిమ అగ్రవాల్!

Sircilla: బోయినపల్లి మండలం వరదవెల్లిలో భూ భారతి రీ సర్వేను పరిశీలించిన సిరిసిల్ల కలెక్టర్ గరిమ అగ్రవాల్. రైతుల సమక్షంలోనే ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశం.

KALEEM, SIRICILLA
Published on: 13 Oct 2026 5:57 PM IST
Sircilla
X

Sircilla: రైతుల సమక్షంలోనే రీ సర్వే చేయాలి కలెక్టర్ గరిమ అగ్రవాల్!

Sircilla: భూ భారతి పథకం కింద చేపడుతున్న భూముల రీ సర్వేను రైతుల సమక్షంలోనే నిర్వహించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. భూములకు సంబంధించిన వివరాలను పూర్తి కచ్చితత్వంతో నమోదు చేయాలని సూచించారు.

బోయినపల్లి మండలం వరదవెల్లి గ్రామంలో మంగళవారం రోవర్ యంత్రం ద్వారా కొనసాగుతున్న భూముల రీ సర్వే పనులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్వే యంత్రం ద్వారా భూముల వివరాలను సేకరిస్తున్న విధానాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలో భూ భారతి కింద భూముల రీ సర్వే పనులను పకడ్బందీగా పూర్తి చేయాలని తెలిపారు. సర్వే ప్రారంభానికి ముందుగా గ్రామ పంచాయతీ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు రైతులకు సమాచారం అందించాలని సూచించారు. రైతుల సమక్షంలోనే సర్వే నిర్వహిస్తూ భూముల వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని స్పష్టం చేశారు. సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులకు సమాచారం అందించిన తర్వాతే రీ సర్వే పనులు చేపట్టాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో తహసీల్దార్ షరీఫోద్దీన్, సర్వే శాఖ అధికారులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA