Sircilla: ఆడిపాడిన మున్సిపల్ చైర్పర్సన్ కళా చక్రపాణి!
Sircilla: సిరిసిల్ల బతుకమ్మ ఘాట్లో మున్సిపాలిటీ, మెప్మా ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి.
Sircilla: ఆడిపాడిన మున్సిపల్ చైర్పర్సన్ కళా చక్రపాణి!
సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణంలోని స్థానిక బతుకమ్మ ఘాట్లో మున్సిపల్ కార్యాలయం, మెప్మా విభాగం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి, మహిళా కౌన్సిలర్లు, మున్సిపల్ మహిళా అధికారులు పాల్గొని బతుకమ్మ ఆడారు. సంప్రదాయబద్ధంగా నిర్వహించిన ఈ వేడుకలు సందడిగా సాగాయి.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు దార్నం అరుణ లక్ష్మీనారాయణ, కూర భాగ్యలక్ష్మి దేవరాజ్, గుండ్లపళ్లి నీరజ పూర్ణచందర్, మెరుగు మంజుల శ్రీనివాస్, పాషికంటి రమ్య సత్యనారాయణ, కొండ వర్షిణి నరేష్, కల్లూరి రేణుక రాజు, ఊరగొండ లక్ష్మీరాజు, రిక్కమల్లె రజిత సంపత్, ఆకుల స్వప్న కృష్ణ పాల్గొన్నారు.
మున్సిపల్ కమిషనర్ ఎండీ ఖాదిర్ పాషా, వైస్ చైర్మన్ దార్ల సందీప్, కౌన్సిలర్ బత్తుల రమేష్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మాజీ కౌన్సిలర్ గుండ్లపళ్లి పూర్ణచందర్, బత్తుల వనజ రమేష్, రిక్కమల్లె సంపత్, సెస్ డైరెక్టర్ దార్నం లక్ష్మీనారాయణ, ఫ్యాక్స్ డైరెక్టర్ గడిల సురేష్ కుమార్, మెరుగు శ్రీనివాస్తో పాటు పలువురు ప్రముఖులు, ప్రజలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.




