Sircilla: రుద్రంగి రైతు వేదికలో ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి రైతు వేదికలో వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావం, ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం.
Sircilla: రుద్రంగి రైతు వేదికలో ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని రైతు వేదికలో వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావం, కేట్ బచావో (పంటల సంరక్షణ) మరియు యాసంగి పంట మార్పిడిపై రైతులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సమావేశంలో అధికారులు మాట్లాడుతూ నీటి కొరతను దృష్టిలో ఉంచుకొని అధిక నీటి అవసరమున్న పంటల సాగుపై పునరాలోచించాలని సూచించారు. పరిస్థితులకు అనుగుణంగా పసుపు, వెల్లుల్లి, మిరప, ధనియాలు వంటి పంటల సాగు యాజమాన్య పద్ధతులు, ప్రత్యామ్నాయ పంటల ఎంపిక మరియు నీటి సమర్థవంతమైన వినియోగంపై రైతులకు సమగ్రంగా వివరించారు.
ఈ సమావేశానికి మండల్ ప్రత్యేక అధికారి, MPDO నటరాజ్ గారు , ఎం.ఏ.ఓ (MAO)సాయి కిరణ్ , ఎం.ఆర్.ఓ (MRO)పుష్పలత , ఏ.ఈ.ఓ (AEO), అధికారులు పాల్గొన్నారు. అలాగే ఏఎంసీ చైర్మన్ తిరుపతి గారు , గ్రామ సర్పంచ్ గoడి నారాయణ తదితరులు హాజరయ్యారు.
రైతు సుమంతు రాజిరెడ్డి పొలంలో MAO ఫీల్డ్ విజిట్:
రైతు వేదికలో సమావేశం ముగిసిన అనంతరం, క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా ప్రగతిశీల రైతు సుమంతు రాజిరెడ్డి గారి పొలాన్ని ఎం.ఎ.ఓ గారు ఫీల్డ్ విజిట్ చేశారు. ఈ ఫీల్డ్ విజిట్‌లో ఎం.ఏ.ఓ సర్ తో పాటు ఎ.ఇ.ఓ ఎస్ పాల్గొని పంటల పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించి, రైతుకు తగిన సలహాలు, సూచనలు అందించారు.




